హైదరాబాద్: అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వాళ్ళు తెలుగు శ్రోతలని అలరించడానికి ఒరిజినల్ తెలుగు పాప్ మ్యూజిక్ తో ఒక కొత్త మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ని లాంచ్ చెయ్యబోతున్నారు. ‘అమెజాన్ మ్యూజిక్ హైదరాబాద్ గిగ్’ పేరుతో ప్రారంభం అవపోతున్న ఈ షో మొదలు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ సబ్ స్క్రైబర్స్ కి అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ గిగ్ ఒక కొత్త తెలుగు పాప్ మ్యూజిక్ ని ఆవిష్కరించడానికి అవకాశాలు క్రియేట్ చేస్తుంది అని అమెజాన్ వాళ్ళు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ గిగ్ కొత్త అవకాశాలు క్రియేట్ చేయడానికి ఇంతకు ముందెప్పుడూ వినని సరికొత్త మ్యూజిక్ తో మేజిక్ చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఇందులో తెలుగు లో ఉన్న కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొన బోతున్నారు.
వివేక్ సాగర్ –
పెళ్లి చూపులు , ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలతో తన నుండి రెగ్యులర్ మ్యూజిక్ కాకుండా ఒక కొత్త సౌండింగ్ వస్తుందని ప్రూవ్ చేసుకున్న సంగీత దర్శకుడు.
గోపి సుందర్ –
తెలుగులో మజిలీ, నిన్ను కోరి, భలే భలే మగాడివోయ్ లాంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చి మంచి ఫార్మ్ లో ఉన్నాడు
జస్టిన్ ప్రభాకరన్ –
సినిమా అంతగా ఆడనప్పటికీ డియర్ కామ్రేడ్ వంటి కల్ట్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
గిబ్రాన్–
చేసింది తక్కువ సినిమాలే అయినా తన బాగ్ గ్రౌండ్ మ్యూజిక్(సాహో ఫేమ్) తో మాయ చేయగల మ్యూజిక్ డైరెక్టర్
శ్రీ చరణ్ పాకాల–
క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో తనకొక ప్రత్యేక ఒరవడి క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్
ప్రశాంత్ ఆర్ విహారి–
మెంటల్ మదిలో, చి.ల.సౌ లాంటి సినిమాలతో ఇపుడిపుడే ఎదుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్
1st ఎడిషన్ ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ తో ప్రారంభం అవుతున్నట్టు అమెజాన్ వారినుండి అధికారిక ప్రకటన వెలువడింది. సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం ఇప్పటి వరకు వాళ్ళ మ్యూజిక్ తో ఇదివరకే మేజిక్ చేయగలరని ప్రూవ్ చేసుకున్నారు. ఇలాంటి షో లు మ్యూజిక్ లో కొత్త పోకడల్ని తీసుకొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మ్యూజిక్ లవర్స్ కి ఇది హ్యాపీ మూమెంట్.