చైనా యాప్స్ బ్యాన్ చేసి భారత్ షాక్ ఇచ్చి కొన్ని రోజులు గడవకనే ఇప్పుడు అమెరికా కూడా అదే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘చైనా యాప్స్ నిషేధం అనే అంశం అధ్యక్షుడి పరిశీలనో ఉంది. అయితే అధ్యక్షుడి కంటే ముందు నేను బయట పడకూడదు. ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. ‘ అన్నారు.
అమెరికా చట్ట సభల సభ్యులు కూడా టిక్ టక్ యాప్ పట్ల ఆందోళన వ్యక్తం చేశారన్నారు. చైనాలోని సాఫ్ట్ వేర్ కంపెనీలు అక్కడి కమ్యూనిష్టు ప్రభుత్వ నియంత్రణ లో వారికి సహకరిస్తున్నాయని ఆరోపించారు. అమెరికా డాటాను వారు నిర్వహించడంపై వారు అభ్యంతరం తెలిపారు.
ప్రపంచం నలుమూలల వాడుతున్న టిక్ టాక్ యాప్ మాత్రం చైనాలో వాడుకలో లేదు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ దేశాలను చైనా యాప్స్ నిషేధించాలని ఆయన కోరారు. కరోనా ప్రపంచం మొత్తం విస్తరించడానికి, వీరవిహారం చేయడానికి చైనా వైఖరే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో కాస్త గట్టిగానే అన్నారు. తాజాగా హాంగ్ కాంగ్ విషయంలోనూ అమెరికా చైనాపై కాస్త గుర్రుగా ఉంది.
ఇప్పటికే గల్వాన్ వ్యాలీ ఘటన విషయంలో దేశ భద్రత దృష్ట్యా భారత్ చైనాకు సంబంధించిన 59 యాప్స్ నిషేధించింది. భారత్ నిర్ణయాన్ని ప్రపంచలోని చాలా దేశాలు ఇప్పటికే బహిరంగంగా సమర్థించాయి. అమెరికాలోని ప్రముఖులు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు.
ఇప్పుడు అమెరికా కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే ప్రపంచలోని ఇతర దేశాలు కూడా ఇదే నిర్నయాన్ని అమలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే చైనాకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టే. ఆర్థికంగానూ మరియు సామాజికంగానూ ఇది చైనాకు కోలుకోలేని పెద్ద దెబ్బ అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో ఏమి జరగనుందో వేచి చూడాలి.