టాలీవుడ్: కరోనా టైం లో ఓటీటీ ల ప్రభంజనం బాగానే పెరిగింది. థియేటర్ లు తెరుచుకున్నా కూడా ఓటీటీలలో సినిమాలు విడుదలలు ఆగట్లేదు. చిన్న సినిమాలవరకే అనుకున్న ఓటీటీ రిలీజ్ లు నారప్ప తో వెంకటేష్ లాంటి పెద్ద హీరో సినిమాకి కూడా చేరాయి. ప్రస్తుతం మరో చిన్న సినిమా ఓటీటీ లో విడుదల అవనుంది. స్వామి రారా, రౌడీ ఫెల్లో, చలో లాంటి సినిమాల్లో తనదైన కామెడీ తో అలరించిన ‘సత్య’ మొదటి సారి హీరోగా రూపొందిన ‘వివాహ భోజనంబు’ అనే సినిమాని ఓటీటీ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
లాక్ డౌన్ కన్నా కొంచెం ముందు పెళ్లి అయ్యి, పెళ్లి అవగానే పూర్తి లాక్ డౌన్ విధించడం తో అమ్మాయి తరపు ఫామిలీ మొత్తం హీరో ఇంట్లోనే ఉంటారు. అసలే పిసినారి అయిన హీరో ఆ ఫామిలీ మొత్తాన్ని మొదటి లాక్ డౌన్ సమయంలో ఎలా భరించాడు అనే కాన్సెప్ట్ పైన కామెడీ జెనెరేట్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్ గా ఆకట్టుకుంది. కరోనా సమయంలో జరిగిన కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమాని రూపొందించారు.
హీరో సందీప్ కిషన్ తన సొంత బ్యానర్ ‘వెంకటాద్రి టాకీస్ ‘ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. రామ్ అబ్బరాజు అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఈ మధ్యనే సౌత్ మార్కెట్ పై కన్నేసిన సోనీ LIV ఓటీటీ తమిళ్ లో ఐశ్వర్య రాజేష్ నటించిన ‘తిట్టం ఇరుండు’ అనే ఒక సినిమా థ్రిల్లర్ సినిమా ని ఓటీటీ లో విడుదల చేసి హిట్ సాధించింది. ఇపుడు ఈ సినిమాని తమ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. కొద్దీ రోజుల్లో ఈ సినిమాని సోనీ LIV ఓటీటీ లో స్ట్రీమ్ చేయనున్నారు.