న్యూఢిల్లీ: వాట్సాప్ తన వినియోగదార్ల కోసం ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ ‘వ్యూ వన్స్’ అనే ఒక కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. వ్యూ వన్స్ ఫీచర్ వల్ల వినియోగదారుడు తను పంపిన ఫోటో, వీడియో మరియు మెసేజ్‌లను గ్రహీత యూజర్ చూడటానికి నియంత్రించే అవకాశం ఇస్తుంది.
ఇంతవరకు వాట్సాప్‌లో యూజర్ వీడియోను లేదా ఫోటోలను పంపిస్తే దాన్ని గ్రహీత వాటిని చూడగలుగుతాడు. సాధారణంగా అలంటి వీడియోలు, ఫోటోస్ ఒక్కసారి రెసిపెంట్ యూజర్ డౌన్‌లోడ్ చేశాక ఎల్లప్పుడు దాన్ని అందుకున్న యూజర్ మొబైల్‌లో అలానే ఉండిపోతాయి.
రెసిపెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజర్ పంపిన సమాచారాన్ని చూసుకోగలడు. కాగా ప్రస్తుతం వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ వల్ల రెసిపెంట్ కేవలం ఒక్కసారి మాత్రమే అలాంటి మేసెజ్‌లను చూడగలరు. కాగా ఈ ఫీచర్ అప్‌డేట్‌డ్ వాట్సాప్ యాప్ కల్గి ఉన్న ఐఫోన్ యూజర్లకు ఇవాళ భారత్‌లో విడుదల చేసింది.
కాగా వాట్సాప్ ఈ ఫీచర్ ను తమ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కాసేపటికే ఆండ్రాయిడ్ వినియోగదార్లకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ యాప్ వాట్సాప్ 2.21.150 వెర్షన్‌లో అందుబాటులో వచ్చింది. వ్యూ వన్స్ ఫీచర్‌లో భాగంగా వాట్సాప్ యాప్‌లో ఫోటో లేదా వీడియోను సెండ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ బార్ పక్కన కొత్తగా ‘1’ చిహ్నాంపై ట్యాప్ చేయాలి.
దీంతో రెసిపెంట్ మీరు పంపిన ఫోటోను, లేదా వీడియోను ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. రెసిపెంట్ మేసేజ్‌ను ఒపెన్ చేశాక ‘ఒపెన్డ్’ అనే సందేశం కన్పిస్తుంది. వ్యూ వన్స్ ఫీచర్‌తో మీడియా కంటెంట్‌ను రెసిపెంట్ (గ్రహీత) ఫోటోలు లేదా వీడియోలు మొబైల్ గ్యాలరీలో సేవ్ కావు.