టాలీవుడ్: సినిమాలు, వెబ్ సిరీస్ ల తర్వాత ఇపుడు అంథాలజీ సిరీస్ ల సంఖ్య పెరుగుతుంది. నాలుగు ఐదు కథలని కలిపి ఒక సిరీస్ లాగ రూపొందించి విడుదల చేసే ఈ అంథాలజీ సిరీస్ లు తమిళ్ లో ఇప్పటికి మూడు నాలుగు వచ్చి విజయవంతం అయ్యాయి. రేపు తమిళ్ లో చాలా పెద్ద స్టార్ట్ కాస్ట్ నటించిన 9 కథలకి సంబందించిన ‘నవ రస’ కూడా విడుదల అవనుంది. తెలుగులో ‘పిట్ట కథలు’ అని ఒక అంథాలజీ సిరీస్ ని రూపొందించారు. హిందీ లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ కి ఇది రీ-మేక్. ఈ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం తెలుగులో మరో అంథాలజీ సిరీస్ రూపొందుతుంది.
ఈ మధ్యనే నాచురల్ స్టార్ నాని స్థాపించిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తన అక్క అయిన గంటా దీప్తి దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ అని ప్రకటించారు. కానీ ఇవాళ అది సినిమా కాదు అంథాలజీ సిరీస్ అని ప్రకటించారు. ‘మీట్ క్యూట్’ అనే పేరుతో ఈ సిరీస్ రూపొందుతుంది. ఈ సిరీస్ గురించి చెప్తూ 5 కథలు అంటూ ఈ సిరీస్ షూట్ కి సంబందించిన ఫోటో కోల్లెజ్ విడుదల చేసారు. ఈ సిరీస్ లో సత్య రాజ్, మళ్ళీ రావా లో నటించిన ఆకాంక్ష సింగ్, సీనియర్ ఆక్టర్ రోహిణి, తమిళ నటి సునయన, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, రుహాని శర్మ తదితరులు నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతంలో ఈ సిరీస్ రూపొందుతుంది.