హైదరాబాద్: అమెజాన్ తెలంగాణ ఫుల్‌ఫిల్ సెంటర్ల విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనుందని సమాచారం. కాగా ఈ సెంటర్ ని హైదరాబాద్ సరిహద్దులో ఉన్న సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మేడ్చల్‌లో ఉన్న ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను అదనంగా ఒక లక్ష చదరపు అడుగులతో మొత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచింది అమెజాన్.
కాగా ఈ తాజా నిర్ణయంతో అమెజాన్ రాష్ట్రంలో తమ ఐదు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను కలిగినట్లు అవుతుంది. అలాగే తెలంగాణలో ఒక మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న ఏకైక అతి పెద్ద సంస్థగా అమెజాన్ అవతరించబోతోంది. కాగా తెలంగాణలో అమెజాన్ మొత్తం సరుకు నిల్వ సామర్థ్యం దాదాపు 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది.
అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ డైరక్టర్ అభినవ్ సింగ్ ఈ విషయమై మాట్లాడుతూ, ఈ తాజా విస్తరణతో తన కస్టమర్లకు లార్జ్ అప్లయేన్సస్, ఫర్నిచర్ విభాగంలో సరికొత్త అనుభూతిని ఇస్తోందని అభినవ్ పేర్కొన్నారు. దీనితోపాటు రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు కూడా సాధికారిత వస్తోందని ఆయన అన్నారు. తాజా విస్తరణతో రాష్ట్రం మొత్తంలో అమెజాన్ ఫ్లోర్ ఏరియా 35 శాతం మేర, ఒవరాల్ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగునుందని ప్రకటించారు.