కోలీవుడ్: సైడ్ డాన్సర్ గా ప్రయాణం ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా ఎంతో మంది పెద్ద హీరోలతో పని చేసి తర్వాత డైరెక్టర్ గా ఎదిగాడు రాఘవ లారెన్స్. మొదట్లో కొన్ని మాస్ సినిమాలు రూపొందించి తర్వాత కాంచన, ముని సిరీస్ సినిమాలతో కేవలం దయ్యం సినిమాలకే పరిమితం అయ్యాడు. ఆ జానర్ లోనే వరుసగా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాంచన, ముని సినిమాల ద్వారా కొంతం సక్సెస్ అయ్యాడు కానీ ఆ సిరీస్ లో చివరగా వచ్చిన ‘గంగ’ సినిమాతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు లారెన్స్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే భయపెట్టడానికి సిద్ధం అయ్యాడు.
‘దుర్గ’ అనే టైటిల్ తో ఈ సినిమాని రూపొందించనున్నట్టు ప్రకటించడం తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ లో పూర్తిగా గడ్డం పెంచుకుని సాధువు రూపంలోనే ఉన్నప్పటికీ కళ్లు పైకేసి ఉన్న లుక్ తో భయంకరంగా కనిపిస్తుంది. మరి ఈ సినిమా కాంచన సిరీస్ లో భాగంగానే రూపొందిస్తున్నారా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు. రాఘవ లారెన్స్ సొంత నిర్మాణంలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. డైరెక్టర్ పేరు ప్రకటించినప్పటికీ లారెన్స్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు కొద్దీ రోజుల్లో తెలియాల్సి ఉంది.