టాలీవుడ్: మహేష్ బాబు హీరో గా , గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి మహేష్ బర్త్ డే బ్లాస్టర్ వీడియో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఉదయం విడుదల చెయ్యాలనుకున్న ఈ వీడియో రాత్రికే విడుదల చేసారు. టీజర్ మొత్తం లో మహేష్ కొత్త స్టైలింగ్, కొత్త మ్యానరిజమ్స్ ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పవచ్చు.
వీడియో ఆరంభం లోనే ఇందుమూలంగా అంటూ ఊర్లలో చేసే ప్రకటన బ్యాక్ డ్రాప్ లో మహేష్ మెడలోని ‘ఓం’ లాకెట్ ని , మెడ పైన ఉన్న రూపాయి టాటూ ని చూపించి ఫైట్ సీక్వెన్స్ లో మహేష్ స్టైలిష్ యాక్షన్ ని చూపిస్తారు. ఆ వెంటనే కీర్తి సురేష్ మహేష్ కి హారతి ఇచ్చే సీన్ , వెన్నెల కిశోరె తో కామెడీ సీన్ అంతా మహేష్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. చివర్లో ఒక ఆఫీస్ సెట్ అప్ లో కీర్తి సురేష్ పెట్టుకున్న మల్లె పూల పై మహేష్ కామెట్స్ చేస్తుండడం చూపిస్తారు. ఓవరాల్ గా పూర్తి యాక్షన్, ఫామిలీ, లవ్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని ఒక నిమిషం వీడియో లో కవర్ చేసారు.
ఈ వీడియో మహేష్ యంగ్ లుక్ తో పాటు మురారి సినిమాలో హీరోయిన్ ని అల్లరి పట్టించే సీన్స్ గుర్తుకు తెస్తాడు మహేష్. దీనికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో థమన్ మ్యూజిక్ అదరగొట్టాడు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అని తెలుస్తుంది. కీర్తి సురేష్ కూడా పరశురామ్ ఇదివరటి సినిమాల్లో లాగ క్లాసిక్ లుక్ తో ఉంది. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్ , 14 ప్లస్ రీల్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 13 , 2022 న ఈ సినిమా విడుదల అవనుంది.