ఢాకా: సీనియర్లు లేక పెద్దగా అనుభవం లేని ఆటగాళ్ళతో బంగ్లాదేశ్ కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు అత్యంత దారుణ ప్రదర్శనతో ఓటమితో ఈ సిరీస్‌ను ముగించింది. ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా సోమవారం చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను పేలవ ప్రదర్శనతో కేవలం 62 పరుగులకే మట్టికరిపించింది.
కాగా ఇంతవరకు టి20లు మరియు వన్డేలలో ఆసీస్ కు ఇదే అత్యంత తక్కువ స్కోరు. ఈ మ్యాచ్ కు ముందు 2005లో ఇంగ్లండ్‌పై ఆసీస్ చేసిన 79 పరుగులే అత్యల్ప స్కోరుగా ఉండేది. ఆసీస్ తో చివరి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఓటమితో టి20ల్లో వరుసగా రెండవ సిరీస్ ఓటమి నమోదైంది. క్రితం నెలలో వెస్టీండీస్ చేతిలో ఆస్ట్రేలియా 1–4తో సిరీస్ ఓడింది. 5వ టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా ఛేధనలో ఆ్రస్టేలియా జట్టు 13.4 ఓవర్లలో కేవలం 62 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యి మ్యాచ్ ఓడింది. ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ వేడ్ (22 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), బెన్ మెక్‌డెర్మట్ (16 బంతుల్లో 17; 1 సిక్స్) మినహా మిగతా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ అందరూ కేవలం సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేసి అవుటయ్యారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ తన అద్భుత బౌలింగ్ తో (4/9) మరియు సైఫుద్దీన్ (3/12) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఆస్ట్రేలియతో టీ20 సిరీస్‌లో ఏడు వికెట్లతో పాటు 114 పరుగులు చేసిన షకీబుల్ హసన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.