హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. ఒక్క తెలుగు లోనే కాకుండా ఇండియా లెవెల్ లో అభిమానులు ప్రభాస్ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తరువాత చేసిన సాహో
కూడా పాన్ ఇండియా స్థాయిలో వుండటం, ఈ సినిమా తెలుగు కన్నా కూడా హిందీ లో హిట్ టాక్ సంపాదించుకుంది.
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ ‘రాధాకృష్ణ కుమార్‘ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా అప్డేట్ గురించి ఇప్పటికే చాలా సార్లు యూవీ క్రియేషన్స్ వాళ్ళని అభిమానులు చాలా రకాలుగా ట్రోల్ చేశారు. చివరకి వాళ్ళ దగ్గరినుండి ప్రభాస్ 20 సినిమా గురించి అప్డేట్ వచ్చింది.
ఈ నెల 10న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయబోతున్నట్టు హీరో ప్రభాస్, చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి రాధేశ్యామ్
అని ‘ఓహ్ డియర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు రూమర్స్ ఉన్నాయి. ఈ సినిమా సంగీత దర్శకుడి గురించి కూడా చాల మంది పేర్లే వినిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ తో మేకర్స్ వీటన్నిటికీ చెక్ పెట్టె ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా జస్ట్ అప్డేట్ కే ట్విట్టర్ లో ప్రభాస్ 20 ట్రెండ్ అవుతుంది.