fbpx
Sunday, December 22, 2024
HomeMovie Newsచివరి షెడ్యూల్ మొదలుపెట్టిన 'మేజర్'

చివరి షెడ్యూల్ మొదలుపెట్టిన ‘మేజర్’

Major LastSchedule Shoot

టాలీవుడ్: రీజనల్ సినిమాల్ని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్న తరుణంలో దేశం గర్వించదగ్గ ఒక ఆర్మీ హీరో కథని బేస్ చేసుకుని ‘మేజర్’ అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. అడవి శేష్ టైటిల్ రోల్ లో పోషిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో పూర్తి అవనుంది. ముంబై అట్టాక్స్ లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. కరోనా కారణంగా ఇన్ని రోజులు బ్రేక్ పడిన ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ఈ రోజే మొదలైనట్టు మేకర్స్ ప్రకటించారు. మేజర్ సందీప్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో ట్రైన్ అయిన డేస్ ని ఈ షెడ్యూల్ లో షూట్ చేసి సినిమా పూర్తి చేయనున్నారు.

గూఢచారి లాంటి సూపర్ సక్సెస్ఫుల్ సినిమాని రూపొందించిన శశి కిరణ్ తిక్క ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం సోనీ పిక్చర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్, A +S మూవీస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. గూడచారి, ఎవరు, నాంది సినిమాలని సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో సినిమా రిలీజ్ కి సరైన టైం చూసుకుని ఈ సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular