టాలీవుడ్: 90 ల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఫామిలీ హీరో శ్రీకాంత్ హీరో గా రూపొంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అనూహ్యమైన విజయం సాధించిన సినిమా ‘పెళ్లి సందడి’. కీరవాణి సంగీతంలో మ్యూజికల్ హిట్ గా ఈ సినిమా అప్పట్లో మంచి రికార్డ్ లని నెలకొల్పింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పెళ్లి సందD’ అనే టైటిల్ తో ఇపుడు ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ‘వశిష్ట’ అనే ఒక ప్రత్యేక పాత్రలో రాఘవేంద్ర రావు మరో ప్రత్యేక పాత్రలో పెళ్లి సందడి లో హీరోయిన్ గా నటించిన దీప్తి భట్నాకర్ నటిస్తున్నారు.
ఈ రోజు ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల చేసారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మార్క్ లో పెళ్లి హడావిడి లో ఈ పాటని షూట్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ మ్యూజిక్ పరంగా , మేకింగ్ పరంగా పెళ్లి సందడి పాటని మాత్రం మ్యాచ్ చేయలేకపోయింది అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి అనే నూతన దర్శకురాలు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు దర్శకేంద్రుడి పర్యవేక్షణలో సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వంలో ఇలాంటి సినిమానే ఒకటి విడుదలై నిరాశ పరచింది. ఇపుడు ఈ సినిమా కూడా అలాగే అవుతుందా అని అనిపిస్తుంది. ఈ సినిమా శ్రీకాంత్ కుమారుడు రోషన్ కి హిట్ సాధించి మంచి బూస్ట్ అవ్వాలని ఆశిద్దాం.