టాలీవుడ్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య , ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా పుష్ప. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా నుండి వస్తున్న అప్ డేట్స్ ఈ సినిమా పైన అంచనాలు పెంచుతున్నాయి. ఎర్ర చందనం స్మగ్లర్ గా బన్నీ మాస్ అప్పీల్ ఈ సినిమాలో స్పెషన్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఈ సినిమా నుండి ఈ రోజు మొదటి పాటని విడుదల చేసారు.
‘దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ఈ రోజు విడుదల చేసారు. ఈ పాటని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. తెలుగు లో చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ తో అదరగొట్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో ఈ పాట రూపుదిద్దుకుంది. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అనగానే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ వూహించుకుకోవచ్చు. కానీ మ్యూజిక్ పరంగా ఈ పాట అంచనాలని అందుకోలేదు అని చెప్పవచ్చు. లిరికల్ వీడియో లో ఉన్న విజువల్స్ మాత్రం సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉన్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని , రవి శంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా మొదటి భాగాన్ని క్రిస్టమస్ సందర్భంగా విడుదల చేయనున్నారు.