టాలీవుడ్: సెకండ్ వేవ్ తగ్గి థియేటర్లలో సినిమాలు విడుదల అవుతుండడం తో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమం లో లో-బడ్జెట్ లో రూపొందిన మరిన్ని సినిమాలు కూడా విడుదల తేదీ లని ప్రకటించేస్తున్నాయి. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుండడం తో విడుదల తేదీలపై కర్చీఫ్ లు వేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ వారం విశ్వక్సేన్ ‘పాగల్’ సినిమా విడుదల అవుతుండగా వచ్చే వారం శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ విడుదల అవనుంది. ఆ తర్వాత వారం సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల అవనున్నట్టు నిన్ననే ప్రకటించారు. అదే వారం విడుదల చేయడానికి మరో రెండు సినిమాలు కూడా సిద్ధం అయ్యాయి.
శ్రీనివాస్ అవసరాల హీరో గా నటించిన ‘101 జిల్లాల అందగాడు’ సినిమాని ఆగష్టు 27 న విడుదల చేయనున్నారు. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా నటించి సూపర్ హిట్ అయిన ‘బాలా’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుహాణి శర్మ నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాని రాచకొండ విద్యాసాగర్ డైరెక్ట్ చేసారు.
అక్కినేని హీరో సుశాంత్ హీరో గా ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమా రూపొందింది. తాను ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి ఉండే ఏరియా లో ఉండే వాళ్ళతో తన బైక్ కారణంగా వచ్చిన గొడవలు కాన్సెప్ట్ నేపధ్యం లో ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు తో ఈ సినిమా రూపొందింది. S దర్శన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఎన్నో రోజులుగా రిలీజ్ టైం కోసం ఎదురుచూసి ఈ నెల 27 న థియేటర్ లలో విడుదల చేయనున్నారు.