అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 వైరస్ కట్టడి చేయడానికి అవలంబిస్తున్న చర్యలు చాలా బాగున్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇవాళ కితాబునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఏపీలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని అన్నారు.
ఇవాళ రణ్దీప్ గులేరియా మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఎస్‌వోపీ పాటించడంపైనే థర్డ్‌వేవ్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ థర్డ్ వేవ్ చిన్న పిల్లల పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. కాగా ఇప్పటికే చాలామంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడి రికవరీ కూడా అయ్యారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ముఖానికి మాస్క్ మరియు టీకా తప్ప వేరే మార్గం ఏదీ లేదు అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా గత 24 గంటల్లో ఏపీ 69,088 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 1,535 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.