టాలీవుడ్: కెరీర్ మొత్తం లో ‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్’ మినహా పెద్దగా హిట్ లు లేని సందీప్ కిషన్ సినిమాలు తియ్యడం లో మాత్రం స్పీడ్ తగ్గించట్లేదు. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు సందీప్ కిషన్. సందీప్ కిషన్ హీరో గా ‘గల్లీ రౌడీ’ అనే సినిమా సిద్ధం అయింది. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని ప్రొమోషన్ మొదలు పెట్టిన సినిమా టీం సెప్టెంబర్ 3 న విడుదల చేయనున్నట్టు ఈ రోజు ప్రకటించారు.
సీమ శాస్త్రి, కరెంట్ తీగ, దేనికైనా రెడీ లాంటి కామెడీ సినిమాలని డైరెక్ట్ చేసిన జి.నాగేశ్వర్ రావు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. సందీప్ కిషన్ తో రామ కృష్ణ తెనాలి BA BL అనే సినిమాని రూపొందించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో ఇది రెండవ ఈసినిమా. పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో తమిళ నటుడు , నేషనల్ అవార్డు విన్నర్ అయిన బాబీ సింహ నటిస్తున్నారు మరియు నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో MVV సత్యనారాయణ నిర్మాణంలో కామెడీ ఎంటర్టైనర్ లు రూపొందించే జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 3 న థియేటర్లలో విడుదల అవనుంది.