fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsలేడీ విలన్ తో మేస్ట్రో

లేడీ విలన్ తో మేస్ట్రో

Thamanna LookFrom MaestroMovie

టాలీవుడ్: హిందీ లో ఆయుశ్మాన్ ఖురానా హీరో గా విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘అందాదున్’ సినిమాని తెలుగు లో నితిన్ హీరో గా రీమేక్ చేస్తున్నారు. మేస్ట్రో టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు పోస్టర్స్ మరియు సాంగ్స్ రిలీజ్ చేసారు. మహతి స్వర సాగర్ సంగీతం లో ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల తేదీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో ఒక ముఖ్య మైన లేడీ విలన్ పాత్రలో తమన్నా నటిస్తుంది. వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్, ఎక్ష్ప్రెస్స్ రాజా సినిమాలని డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి తమన్నా పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. తమన్నా నుండి మేస్ట్రో కి ఇండిపెండెన్స్ త్వరగా రావాలని కోరుకుంటున్నాం అని ఈ అప్ డేట్ విడుదల చేసారు. ఈ సినిమాలో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉండే ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. హిందీ లో ఈ పాత్రలో టబు నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నభ నటేష్ నటిస్తున్నారు. దృష్టి లోపం ఉండే ఛాలెంజింగ్ పాత్రలో నితిన్ ఈ సినిమాలో నటించాడు. నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular