హైదరాబాద్: మెగా ఫామిలీ నుండి మరొకరు సినిమా నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతున్నారు. మెగా డాటర్ సుష్మిత కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నట్టు ఆఫీసియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే మెగా ఫామిలీ నుండి నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్’ పేరు తో చాలానే సినిమాలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పేరుతో చిరంజీవి కం బ్యాక్ మూవీస్ ‘ఖైదీ నం 150 ‘, ‘సైరా నరసింహరెడ్డి ‘ సినిమాలు నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పైన కొన్ని సినిమాలు నిర్మించారు. ఇంకా మెగా అనుబంధ సంస్థ అయిన గీత ఆర్ట్స్ కి సినిమా నిర్మాణంలో మంచి పేరుంది. వాళ్ళు ‘ఆహ‘ తో ఓటీటీ కూడా మొదలుపెట్టారు. వీళ్ళ బాటలోనే మెగా డాటర్ సుష్మిత కొణిదెల ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే కొత్త సినిమా నిర్మాణ సంస్థ మొదలుపెట్టబోతున్నట్టు అనౌన్స్ చేసారు.
ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా వెబ్సెరీస్, సినిమా ఇంకా ఇతర ఎంటర్టైన్మెంట్ కంటెంట్ విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా MBBS ‘,’ఖైదీ నం 150’ , ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అనుభవం గడించింది ఈ మెగా డాటర్. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది.
to introduce mega power prince stylish star