టాలీవుడ్: కమెడియన్ స్థాయి నుండి పెద్ద హీరోల సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన బండ్ల గణేష్ ఇండస్ట్రీ లో ఎపుడూ ఎదో ఒక టాపిక్ తో అందరి నోళ్ళలో నానుతూ ఉంటాడు. సినిమా ఈవెంట్ లలో బండ్ల గణేష్ స్పీచ్ కోసం స్పెషల్ ఫాన్స్, ట్రోలర్స్ ఎదురు చూస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ లీగ్ ఆక్టర్స్ తో సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ యాక్టింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపట్లేదు. చివరగా మహేష్ బాబు నటించిన ‘సరి లేరు నీకెవ్వరూ’ సినిమాతో మళ్ళీ కం బ్యాక్ అవుదామనుకున్నాడు కానీ అది ఆ క్యారెక్టర్ అంతగా క్లిక్ అవగా పోగా బండ్ల గణేష్ కి ఒక రకంగా మైనస్ అయింది. ఆ తర్వాత మరే సినిమాలో నటించలేదు.
ప్రస్తుతం బండ్ల గణేష్ హీరో గా ఒక అవార్డు విన్నింగ్ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. యుగానికి ఒక్కడు సినిమాలో నటించిన ‘పార్తీబన్‘ హీరో గా ‘ఒత్త సెరుప్పు 7 ‘ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఒక ప్రయోగాత్మక సినిమా. ఇందులో హీరో తప్ప మరే పాత్ర కనిపించదు. టైటిల్ కూడా 7 వ సైజు లో ఉన్న ఒక చెప్పు అని అర్ధం వస్తుంది. ఈ సినిమాకి కథ, కథనం, నటన , నిర్మాణం, దర్శకత్వం అన్నీ పార్తీబన్ చేసాడు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా సాధించాడు. ఈ సినిమాని ప్రస్తుతం బండ్ల గణేష్ హీరో గా తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. మరి ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలో బండ్ల గణేష్ ఎంత వరకు రాణిస్తారు అనేది చూడాలి.