fbpx
Sunday, January 19, 2025
HomeMovie News2022 వేసవి కి కేజీఎఫ్ చాప్టర్ 2

2022 వేసవి కి కేజీఎఫ్ చాప్టర్ 2

KFGChapter2 Release Update

శాండల్ వుడ్: 2018 డిసెంబర్ లో విడుదలైన ఒక కన్నడ సినిమా కన్నడ సినీ ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చేసింది. కన్నడ నుండి కూడా అద్భుతమైన సినిమాలు వస్తాయని, అప్పటి నుండి సినీ అభిమానుల కళ్ళు కన్నడ ఇండస్ట్రీ వైపు కూడా పడేలా ఆ సినిమా చేసింది. అదే కేజీఎఫ్ చాప్టర్ 1 . ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై విడుదలైన అన్ని భాషల్లో అద్భుతమైన విజయం తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమాకి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రూపుదిద్దుకుంది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసిన ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తుంది.

ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల అవనున్నట్టు ప్రకటించారు కానీ కరోనా కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అయింది. పోనీ డిసెంబర్ లో అయినా విడుదల అవుతుంది లే అని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా మేకర్స్ ఈ సినిమాని 2022 సమ్మర్ కి షిఫ్ట్ చేసారు. 2022 ఏప్రిల్ 14 న విడుదల అవనున్నట్టు ప్రకటించారు. హోంబలే క్రియేషన్స్ బ్యానర్ పై యాష్ హీరో గా రూపొందిన మొదటి పార్ట్ లోని దాదాపు సినిమా కాస్ట్ అంతా ఈ సినిమాలో పని చేయనున్నారు. సెకండ్ పార్ట్ కోసం బాలీవుడ్ నుండి సంజయ్ దత్ , రవీనా టాండన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఘోరమైన విలన్ ‘అధీరా’ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular