కోలీవుడ్: నటిగా, రాజకీయ నాయకురాలిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా , తమిళ నాడు ప్రజలందరూ ‘అమ్మ’ అని పిలుచుకునే జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘తలైవి’. ప్రముఖ బాలీవుడ్ నటి ‘కంగనా రనౌత్’ జయలలిత పాత్రని పోషిస్తుంది. జయలలిత కథ ఆధారంగా తమిళ్ లో వెబ్ సిరీస్ రూపొందింది కానీ క్షేత్ర స్థాయిలో సినిమా రూపొంది విడుదల చేయడం ఇదే మొదటిది. ఇందులో ఎం.జి.ఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సరైన టైం కోసం ఎదురు చూసి సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నారు. తమిళనాడు లో సెప్టెంబర్ లో థియేటర్ లు తెరచుకోనుండడం తో ఈ సినిమాని సెప్టెంబర్ 10 న థియేటర్ లలో విడుదల చేస్తున్నారు.
తెలుగు లో కూడా ఈ సినిమా టైటిల్ ని మార్చకుండా ‘తలైవి’ అనే పేరుతోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఈ సినిమా పైన ఆసక్తి క్రియేట్ చేయగలిగింది. జయలలిత జీవితం లో సినీ ప్రయాణం, రాజకీయ అరంగేట్రం, ఎం.జి.ఆర్ మరణం తర్వాత జయలలిత ఎదుర్కొన్న పరిస్థితులు, రాజకీయాల్లో జయలలిత విజయం లాంటి అంశాలు రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనడం లో సందేహం లేదు. అలాంటి సినిమాని బిగ్ స్క్రీన్ పైన్నే చూడాలని ఈ సినిమాని థియేటర్ లలో విడుదల చేస్తున్నాం అని కంగనా ప్రకటన చేసారు. విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 10 న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.