వాషింగ్టన్: ప్రస్తుతం మొబైల్ ఫోన్లన్నీ సిగ్నల్ కోసం నెట్‌వర్క్ ఫ్రీక్వెన్సీకి భూమి వాతావరణం కి ఆవల నెలకొల్పిన శాటిలైట్లపై ఆధారపడుతున్నాయి. ఐతే ఇకపై ఆ శాటిలైట్లతో పని లేకుండానే భూమి నుంచి కేవలం 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) శాటిలైట్లను మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబోతున్నారు.
ఇందు కోసం ఈ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను ప్రయోగించేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పోటీ పడూతున్నాయి. వాటిలో వ్యాపార దిగ్గజాలైన ఆమెజాన్, ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్, టాటా, టెలిశాట్ వంటి పలు కంపెనీలు ఇప్పటికే ఈ పనిలో బిజీగా ఉన్నాయి. కాగా ఈ సాంకేతికత 1990వ దశకం నుంచి అందుబాటులోనే ఉన్నా వ్యాపార అవసరాలకు వినియోగించుకునేలా మాత్రం ఇప్పుడిప్పుడే అనుమతులు జారీ అవుతున్నాయి.
టెక్నాలజీ వరల్డ్‌లో చాలా నూతన ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ పలు మార్లు కేరాప్ అడ్రస్‌గా నిలిచింది. కొత్త ఫీచర్‌ని ప్రపంచానికి పరిచయం యాపిల్ సంస్థ చేయగానే మిగిలిన పెద్ద కంపెనీలన్నీ అదే బాటలో నడవడం పరిపాటి. మొబైల్ ఫోన్లలో మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, టాప్‌నాచ్ లాంటి పాపులర్ ఫీచర్లలో సగానికి పైగా యాపిల్ వల్లే మార్కెట్లో ట్రెండింగ్లో సాధించాయి.
వాటన్నింటిని మించిన లియో టెక్నాలజీని కూడా తొలిసారి యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్ వర్కాలు అంటున్నాయి. భారత ప్రభుత్వం తరఫున భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ సంస్థ కూడా ఇదే టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుందని సమాచారం.
భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వస్తే దీని ద్వారా సిమ్‌తో అవసరం లేకుండానే నేరుగా హ్యండ్‌సెట్ ద్వారానే ఇటు కాల్స్, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్ కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలో యాపిల్ రిలీజ్ చేయబోతున్న యాపిల్ 13 మోడల్ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై యాపిల్ సంస్థ ఇంకా అధికారికంగా ఎటువంటి ధృవికరణ చేయలేదు.