టోక్యో: జాపాన్ రాజధాని టోక్యోలో కొనసాగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఇప్పటికే రెండు పతకాలు గెలుచుకున్న భారత్ కు తాజాగా ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పురుషుల జావిలన్‌త్రో లో దేవేంద్ర ఝజారియా రజత పతకం సాధించాడు, కాగా సుందర్ సింగ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఈ పతకాలతో సోమవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి.
కాగా భారత్ కు అంతకు ముందు పారా ఒలింపిక్స్ మొట్టమొదటి స్వర్ణ పతకం కూడా లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా భారత్ కు ఇప్పటి వరకు లభించని గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అలాగే డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా కూడా రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
అంతకుముందు మహిళల టేబుల్ టెన్నిస్ లో మొదటి పతకాన్ని భారత్ కు అందించింది భవాని బెల్, అలాగే పురుషుల హై జంప్ లో నిషాద్ కుమర్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.