fbpx
Wednesday, January 29, 2025
HomeAndhra Pradeshనేడు కర్నూలులో మానవ హక్కుల కమీషన్ కార్యాలయం ప్రారంభం!

నేడు కర్నూలులో మానవ హక్కుల కమీషన్ కార్యాలయం ప్రారంభం!

AP-HRC-IN-KURNOOL-STARTS-FROM-TODAY

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆకాంక్ష అయిన మూడు రాజధానుల విషయంలో ఒక ముందడుగు పడింది. న్యాయ రాజధానిగా పేర్కొన్న కర్నూలులో మరో కీలక న్యాయసంస్థ ఏర్పాటుకు సర్వం సిద్ధంగా ఉంది. రాయలసీమలో ఈ పాటికే లోకాయుక్త ప్రారంభం అవగా తాజాగా బుధవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ – హెచ్‌ఆర్‌సీ) ప్రారంభం అవబోతోంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిచేసింది. గత కొద్ది రోజుల క్రితం మానవహక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టు నుండి స్పష్టమైన తీర్పు రావడంతో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే గత శుక్రవారం దీనిపై గెజిట్‌ విడుదల చేసింది.

ఈ సందర్భంలోనే సెప్టెంబర్‌ 1వ తేదీన మానవహక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం 10–11 గంటల మధ్య ఆ సంస్థ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్‌ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు జి.శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular