న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష వాయిదా వేయలాన్న విజ్ఞప్తికి సుప్రీంకోర్టు నో అని చెప్పింది. ఇంతకు ముందుగా నిర్ణయించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం రోజునే ఈ పరీక్షను నిర్వహించాలి అని సుప్రీం కోర్టు సదరు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో నీట్ పరీక్షను నిర్వహించనున్న రోజునే దేశంలో ఇతర పోటీ పరీక్షలు కూడా జరగనున్నాయని, అలాగే సీబీఎస్‌ఈ వారి కంపార్ట్‌మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, ఈ కారణం చేత నీట్ పరీక్ష నిర్వహించే తేదీని మరొక తేదీకి వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టులో తమ పిటిషన్లు దాఖలు చేశారు.
కాగా ఈ పిటిషన్లను ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీననే అంటే ఆదివారమే ఈ పరీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.