హైదరాబాద్: ఇటీవలే తెలంగాణ రాష్ట్రం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మా సీట్ల భర్తీకై ఎంసెట్-2021 ని నిర్వహించింది. దీన్ని విజయవంతంగా నిర్వహించి ఇటీవలే వాటి ఫలితాలను కూడా విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఫలితాల విడుదల చేసిన కొద్ది రోజులకే ఇతర కార్యక్రమాలన్నింటినీ చాలా వేగంగా ముందుకు తీసుకెల్తోంది. దీనిలో భాగంగానే ఎంసెట్ లో ఉత్తీర్ణులైన వారికి కాలేజీల్లో సీట్ల కేటాయింపుకై విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల ద్వారా నచ్చిన కాలేజి ని ఎంచుకోవడానికి ఈ రోజు నుంది ప్రారంహించింది.
దీనికి సంబంధించి ఇవాళ నుండి 16వ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీటీఈ రాష్ట్రంలో 161 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. కాగా ఇంజనీరింగ్ విభాగంలో 85,149 సీట్లకు గానూ 60,697 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఈ అడ్మిషన్ష్ కౌన్సిలింగ్ లో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు లిస్టులో చోటు దక్కించుకోలేదు. అలాగే 91 బీ ఫార్మసీ కాలేజీల్లో 7,640 సీట్లు ఉండగా, అందులో 2,691 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. 44 ఫార్మా డీ కాలేజీల్లో 1295 సీట్లు ఉండగా, వాటిలో 454 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి.