హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల ప్రాచుర్యం పొందిన అంశాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక ఒకటి. అక్కడి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి ఆ నియోజకవర్గం ఉపఎన్నికను అన్ని పార్టీలు చాలా సవాలుగా స్వీకరించాయి.
ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికను అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు విపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు స్థానికంగా పట్టు ఉన్న ముఖ్య నేతలనే తమ అభ్యర్థులుగా ప్రకటించడం మొదలెట్టాయి.
ఇదివరకే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గానికి తమ తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌లో బరిలో నిలవబోయే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. శనివారం ఏఐసీసీ బల్మూరి వెంకట్ పేరుని అధికారికంగా ప్రకటించింది.