మూవీడెస్క్: దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు హీరోగా మారనున్నారు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన వెండి తెరకు ఎందరో హీరోలను పరిచయం చేసి ఇప్పుడు ఆయనే కథానాయకుడిగా ఒక సినిమాలో నటించనున్నట్లు సమాచారం.
కాగా ఈ మూవీకి తనికెళ్ల భరణి దర్శకుడిగా వ్యవహరించనున్నారట. దర్శకేంద్రుడి కోసం ప్రత్యేకంగా ఆయన కథ రెడీ చేసినల్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా అయిపోయిందని, త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి కూడా వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో దర్శకేంద్రుడు నలుగురు హీరోయిన్లతో కలిసి సందడి కూడా చేయనున్నారట. దీనితో పాటు మరో చిత్రంలో కూడా ఆయన హీరో నటించబోతున్నారని సమాచారం. ఓం నమో వెంకటేశ చిత్రం తరువాత రాఘవేంద్ర రావు దర్శకుడిగా ఇంకో సినిమా చేయలేదు. ఇక ఆయన రిటైర్‌మెంట్ తీసుకోబోతున్నారని అందరూ ఊహించారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు హీరోగా తెరపై అలరించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.