దుబాయ్: ప్లే-ఆఫ్స్ లో అడుగుపెట్టడానికి ఉన్న ఒక చిన్న అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళాలనే తపన ముంబై ఇండియన్స్ లో కసిని పెంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ అందుకు తగ్గట్టుగానే ధాటిగా ఆడింది.
ముఖ్యంగా ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 84 పరుగులు చేశాడంటె ఎంత ధాటిగా ఆడాడో అర్థమవుతుంది. తరువాత వచ్చిన సూర్యకుమార్ కూడా 40 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 235 పరుగులు చేసి భారీ టార్గెట్ ను హైదరాబాద్ ముంది నిలిపింది.
ఒక వేళ ముంబై హైదరాబాద్ మీద 171 పరుగుల ఆధిక్యంతో గెలిస్తే ముంబై ఇండియన్స్ కు ప్లే-ఆఫ్స్ కు చేరే ఒక చిన్న అవకాశం ఉండడంతో ఎంతో ఆశగా ముంబై బౌలింగ్ ప్రారంభించింది.కానీ వారి ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. హైదరాబాద్ కుడా బ్యాటింగ్ ధాటిగానే ఆరంభించింది.
హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ధాటిగానే ఆరంభించి మధ్యలో తడబడుతూ మొత్తానికి 20 ఓవర్లలో 193 పరుగులు చేసి ముంబై ప్లే-ఆఫ్స్ ఆశలకు గంది కొట్టింది. దాంతో డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్స్ కు చేరకుండానే టోర్నీ నుండి నిష్క్రమించింది.