భువనేశ్వర్: కరోనా వైరస్ నేపథ్యంలో తన శిక్షణ ఖర్చులు తీర్చేందుకు భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతీ చంద్ తన విలువైన బీఎండబ్ల్యూ కారును అమ్మకాన్ని పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతీ స్వయంగా తన ఫేసుబుక్లో వెల్లడించారు. ద్యుతీ 2015 బీఎండబ్ల్యూ3– సిరీస్ మోడల్‌ను కలిగి ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం తనకు రూ .50 లక్షలు మంజూరు చేసిందని, కాగా శిక్షణ ఖర్చులకు తన దగ్గర ప్రభత్వం మంజూరు చేసిన డబ్బులు మొత్తం అయిపోయాయని పేర్కొంది. ఇప్పుడు లొక్డౌన్ కారణంగా స్పాన్సర్లు ఎవరు తన శిక్షణకు ఖర్చు పెట్టటానికి ముందుకు రావట్లేదని ఆమె మీడియాతో అన్నారు.
అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమెకు సహాయం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించటంతో ఆమె తన పోస్టుని డిలీట్ చేసారు.