హైదరాబాద్: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇవాళ (బుధవారం) ప్రొద్దునే ఏడున్నర గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి మూడవ ఫ్లోర్‌లో ఉన్న విద్యుత్ ప్యానెల్ బోర్డు రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఇదే క్రమంలో ఆసుపత్రి లోని ఆరవ ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తీసుకోచ్చారు.
కాగా అదృష్టవశాత్తు ఆసుపత్రిలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతొ అధికారులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన వెంటనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండేంట్ రాజరావు ప్రమాదం జరిగిన ప్రదేశాలను పరిశీలించారు.