హైదరాబాద్: టిక్ టాక్ భారత దేశంలోని యువతకు బాగా దగ్గరైన యాప్, ఎంతో మంది దీని ద్వారా తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేవారు. భారత ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా చైనాకి సంబంధించిన 59 యాప్ లను నిషేధించిన తరువాత టిక్ టాక్ యూజర్లు చాలా మంది ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు.
భారత ప్రధాని స్వయంగా స్వదేశీ యాప్ లను ప్రొత్సహిస్తూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు భారత యువత అందరూ దేశీయ యాప్ లను వెతికే పనిలో పడ్డారు.
ఇలాంటి సందర్భంలో అనేక ప్రత్యామ్నాయాలు కనపడుతుండగా అందులో ఒకటి ‘పాప్-ఇన్ ‘ యాప్. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఐ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తోంది.
టిక్ టాక్ మాదిరిగానే ఆనందాలు, సంతోషాలు, భావాలు వ్యక్తపరిచే ఎన్నో సదుపాయాలను ఇందులో అందించనున్నారు. ఈ యాప్ ను అందరూ సులభంగా ఉపయోగించే విదంగా అలనే అత్యాధునిక సదుపాయాలతో వాడుకునే విధంగాను రూపొందిస్తున్నట్లు ఐ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రతినిధులు కె వెంకటేశ్వరరావు, ఎన్ ఫణి రాఘవ, బంగార్రాజు, కాశీ విశ్వనాధవర్మ తెలియజేశారు.
పాప్ ఇన్ పూర్తి స్వదేశీ యాప్ అని దీని ద్వారా ప్రపంచానికి మన సత్తా చాటుతామని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మన స్వదేశీ యాప్ లపై ఆధారపడే విధంగా భారత్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ ఐటీ/ఇంటర్నెట్ కంపెనీలకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ యాప్ లను అభివృద్ధి చేయాలని, ఉత్తమ యాప్ లకు బహుమతులు ఉంటాయని ప్రకటించారు.
దీనితో ఇప్పుడు ఎన్నో కంపెనీలు, ఔత్సాహిక యాప్ డవలపర్లు యాప్ లను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలోని ఐటీ రంగంలో చాలా దేశాలకు సేవలందిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా యాప్ లు ప్రపంచానికి భారత్ పరిచయం చేసే పనిలో ఉంది. ఇది ఖచ్చితంగా భారత్ కు ప్రపంచం మొత్తం మీద వినియోగదారులు పెంచుకునే అద్భుత అవకాశంగా చెప్పుకోవచ్చు.