న్యూయార్క్: క్రిప్టోకరెన్సీ కి యావత్ ప్రపంచంలో మంచి ఆదరణనే లభిస్తోంది. వ్యార దిగ్గజాలైన ఎలన్ మస్క్ మరియు మార్క్ క్యుబాన్ లాంటి బిలియనీర్లు సైతం పలు క్రిప్టోకరెన్సీలను ఆదరిస్తున్నారు. ఎలన్ మస్క్ ఐతే ఇంకొంచం ముందుకు వెళ్ళి డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎక్కువగా ఆదరిస్తూ పలు సార్లు ట్వీట్లు కుడా చేస్తున్నారు.
డోగీకాయిన్ గాడ్ ఫాదర్‌గా ఇన్వెస్టర్లు ఎలన్‌మస్క్‌ను పిలుస్తుంటారు. అయితే తాజాగా ఎలాన్‌మస్క్ డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానే విషయాన్ని తన అఫిషియల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాలో ఒక ప్రముఖ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో అమెరికా ప్రజల్లో 33 శాతం మంది పౌరులు డోగీకాయిన్ క్రిప్టోకరెన్సీను సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని ప్రముఖ డోగికాయిన్ మిలియనీర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ విషయంపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, అవును నిజమే డోగీ కాయిన్ క్రిప్టోకరెన్సీ ప్రజల క్రిప్టో కరెన్సీ. టెస్లా, స్పేస్‌ఎక్స్‌లో పనిచేసే వారు కూడా డోగీకాయిన్ ఎక్కువగా కల్గి ఉన్నారు అని తెలిపారు. కాగా వారు అంత పెద్ద ఆర్ధిక నిపుణులు మాత్రం కాదని తెలిపాడు.
అందుకనే నేను డోగీకాయిన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని ఎలాన్ మస్ తన ట్విట్‌లో వెల్లడించారు. అప్పడప్పుడు తన పెంపుడు కుక్క షిభా ఫ్లోకీను ఫోటో పెడితే చాలు షిభా ఇను క్రిప్టోకరెన్సీ రయ్‌మని పెరుగుతాయి. అసలు ఎలన్‌మస్క్ దగ్గర షిబా ఇను క్రిప్టోకరెన్సీ లేదని ఇటీవలే పేర్కొన్నారు. ప్రస్తుతం డోగీ కాయిన్, బిట్‌కాయిన్, ఈథిరియం క్రిప్టోకరెన్సీలనే కల్గి ఉన్నట్లు వెల్లడించారు.