ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు అయిన షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరయ్యింది. ఇవాళ ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు, తనకు బెయిల్ ను మంజురూ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఎన్‌సీబీ తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు ఆర్యన్‌తో పాటు మోడల్ మున్‌మున్ ధమేచ, ఆర్భాజ్ మర్చంట్‌కు కూడా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
బెయిల్ మంజూరు అవడంతో ఆర్యన్ ఖాన్ శుక్రవారం జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారుగా 23 రోజుల తరువాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రావడంతో తన కుటుంబ సభ్యులతో పాటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు ఊరట లభించింది. ఈ నెల 2వ తేదీన అర్థరాత్రి క్రూయిజ్ ఓడరేవు డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.
అక్కడ జరిగిన తనిఖిలో ఆర్యన్‌తో పాటు పోలీసులు మరో 8మందిని అరెస్టు చేసారు. ఆ రోజు నుండి ఆర్యన్ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడి బెయిల్ పిటిషన్‌కు ముంబై కోర్టు మూడు స్లార్లు కొట్టివేసింది. దీంతో ఆర్యన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా చివరికి అతడికి ఊరట లభించింది. ఆర్యన్ బెయిల్ పటిషన్‌పై మూడు రోజుల విచారణ అనంతరం హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.