fbpx
Friday, December 13, 2024
HomeBig Storyఅమెరికా భారత్‌కు అద్భుత కళాఖండాల అప్పగింత!

అమెరికా భారత్‌కు అద్భుత కళాఖండాల అప్పగింత!

USA-RETURNS-VALUABLE-ANTIQUITIES-TO-INDIA

న్యూయార్క్‌: భారత్ నుండి కొన్ని ఏళ్ళ క్రితం అపహరణకు గురైన పురాతన కళాఖండాల కార్యాచరణ దర్యాప్తులో భాగంగా సుమారు 15 మిలియన్‌ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు అమెరికా‌ తిరిగి ఇచ్చింది. న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన వేడుకలో ఈ పురాతన వస్తువులను మన దేశానికి అందజేసారు.

ఈ వస్తువులు మాన్‌హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం, యూఎస్‌ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జరిపిన దీర్ఘ దర్యాప్తులో బయట పడ్డాయి. ఈ సందర్భంగా యూఎస్‌ డిస్ట్రిక్‌ అటార్నీ సైరస్ వాన్స్ జూనియర్ మాట్లాడుతూ, డీలర్ సుభాష్ కపూర్ యునైటెడ్ స్టేట్స్‌కు పదివేల పురాతన వస్తువులపై అక్రమంగా తరలించారని ఆరోపణల నేపథ్యంలో విస్తృత దర్యాప్తు పై దృష్టి సారించామన్నారు.

తమ సుదీర్ఘ దర్యాప్తు ఫలితంగా 143 మిలియన్ల డాలర్ల విలువైన 2,500 కళాఖండాలు తిరిగి సంపాదించగలిగాం. ఈ నేరానికి పాల్పడిన కపూర్‌ అతని సహ కుట్రదారులు తగిన శిక్ష పడుతంది. అయితే కపూర్‌ ప్రస్తుతం భారతదేశం జైలులోనే ఉన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు దర్యాప్తును యూఎస్‌ వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా కపూర్‌ గ్యాలరీ నుంచి వాటిని సేకరించిన అమెరికా భారత్‌కు ఈ విలువైన వస్తువలను అప్పగించింది. భారతదేశం మరియు ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల నుండి దోచుకున్న నిధులను రవాణా చేయడానికి న్యూయార్క్‌లోని తన ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీని వినియోగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular