దుబాయ్: టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో చివరిక్ వరకు దోబూచులాడిన విజయం చివరకు సౌతాఫ్రికానే వరించింది. శ్రీలంక బౌలర్ హసరంగా హ్యాట్రిక్ తీసిన శ్రీలంక మ్యాచ్ గెలవలేకపోయింది.
టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ నిస్సంక ఒక్కడే మంచి స్కోరు సాధించాడు. 58 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అసలంకా ఒక్కడే 21 పరుగులు చేశాడు, మిగతా ఎవరూ పెద్ద చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
ఛేజింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఓపనర్లు ఇద్దరూ త్వరగానే అవుటయ్యారు. తరువాత బవుమా మరియు మిల్లర్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి వారి టీం కి విజయాన్ని అందించారు. ఒక దశలో హరరంగా బౌలింగ్ లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయినా వారిద్దరి భాగస్వామ్యం వల్ల సౌతాఫ్రికా గట్టెక్కింది.