హైదరాబాద్: ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న ప్రభాస్ #20 కి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ తో నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ టీ సిరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వేరే చాల సినిమాలని పోలి ఉండడంతో సోషల్ మిడిల్ లో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మిడిల్ లో విపరీతం గా ట్రెండ్ అవుతుంది. విడుదలైన 24 గంటల్లోనే ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ 6.3 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించి ట్విట్టర్ వేదికపై కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఫస్ట్‌లుక్ తోనే ఈ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుండటం పట్ల రెబల్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై అదే స్థాయిలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ సినిమా లుక్ ని పోలి ఉండడం, అలాగే బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం’ సినిమా లుక్ ని పోలి ఉండడం ఇంకా హిందీ లో రణ్వీర్ దీపిక నటించిన రాంలీలా పోస్టర్ ని పోలి ఉండడం తో ఆ పోస్టర్స్ ని జత చేసి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంకా కొందరు కరోనా అవేర్ నెస్ క్రియేట్ చెయ్యడానికి ఆ పోస్టర్ కి మాస్క్ లు జత చేసి మరీ పోస్ట్ లు పెడుతున్నారు.
no need to troll. watch the movie first.