న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య విభాగం దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న స్థానిక సంస్థలకు దాదాపు 8 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఉన్న వైద్య మౌలిక వసతులు మెరుగు పరచుకోవడానికి ఇప్పుడు విడుదల చేసిన నిధులను వినియోగించనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం మొత్తం రూ.8,453.92 కోట్ల నిధులను విడుదల చేసింది.
కేంద్రం విడుదల చేసిన నిధులలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి రూ. 488 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాగా తెలంగాణ రాష్ట్రం తో సహా 9 రాష్ట్రాల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. కాగా రాష్ట్రాల నుండి ప్రతిపాదనలు అందిన తర్వాత ఆ రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల చేయనున్నారు.