న్యూయార్క్: యాపిల్, ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ విషయమై ఒక కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల వర్క్ హోమ్ కే పరిమితమైన తమ సంస్థ ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పని చేయడం విషయమై కీలక ఆదేశాలు జారీ చేసింది.
కాగా యాపిల్ వర్క్ ఫ్రమ్ చేస్తున్న తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావాలని ఇప్పటికే పలుమార‍్లు ఈ-మెయిల్స్ ను పంపింది. అయితే కరోనా వైరస్ వల్ల ఆఫీస్‌లో వర్క్ చేసే విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. కాగా ఇప్పుడు మళ్ళీ తాజాగా యాపిల్ మరోసారి తమ ఉద్యోగులకు డెడ్ లైన్ విధించింది.
ఈ సారి యాపిల్ తమ ఉద్యోగులందరూ ఫిబ్రవరి 1 నుంచి తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని యాపిల్ స్పష్టంగా తెలియజేసింది. క్రితంలో జనవరి 22 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కోరగా ఇప్పుడు దీన్ని ఫిబ్రవరి 1వ తేదీకి పొడిగించారు. తాజా సమాచారం ప్రకారం, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన ఉద్యోగులకు కొత్త వర్క్ ప్లాన్ గురించి కూడా ఈ-మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ తాజా ఈ-మెయిల్ గురించి వచ్చిన కథనాల ఆధారంగా, తమ ఉద్యోగులందరినీ దశల వారీగా ఆఫీస్‌లకు రావాలని టిమ్ కుక్ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీస్‌లో పనిచేయాలని తెలిపారు. ఈ ప్లాన్ 2022 ఫిబ్రవరి1 నుంచి కొనసాగుతుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు సోమవారం, మంగళవారం, గురువారం ఆఫీస్‌కు రావాలని తెలిపారు. బుధవారం,శుక్రవారం ఇంటి నుంచి పనిచేసేందుకు టిమ్ కుక్ అనుమతి ఇచ్చారు.