సిడ్నీ: గడచిన కొన్ని రోజులుగా శాంతించిన కరోనా వైరస్ మళ్ళీ తన ఉధృతి క్రమంగా పెంచుతోంది. తాజాగా యూరప్ దేశాల్లో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ యూరప్ దేశాల్లో ఒక్కటైన ఆస్ట్రియాలో 10 రోజుల పాటు పాక్షిక లాక్‌డౌన్ ఈ సోమవారం ఉదయం నుండి అమల్లోకి వచ్చింది. నాలుగో వేవ్ వల్ల ఆస్ట్రియాలో శనివారం నాడు 15,297 కొత్త కేసులు నమోదయ్యాయి.
క్రిత వారం ప్రతి రోజూ 10వేలకు పైగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతుండటంతో అక్కడ పాక్షిక లాక్‌డౌన్ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా 10 రోజుల పాటు ఈ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటన చేసింది.
ఫిబ్రవరి 1 నుంచి దేశంలోని ప్రతిఒక్కరికా వ్యాక్సిన్ తప్పనిసరి చేయనున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండెర్ ఛాలెన్‌బెర్గ్ శుక్రవారంనాడు స్పష్టం చేశారు. పశ్చిమ యూరప్‌లో అతి తక్కువగా ఆస్ట్రియాలో 66 శాతం మంది మాత్రమే ఇప్పటి వరకు పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ కట్టడికి సరైన చర్యలు తీసుకోకపోగా లాక్‌డౌన్ పేరుతో జనాలను బలి చేస్తున్నారని మండిపడుతున్నారు.