కాంపూర్: భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మొత్తానికి డ్రాగా ముగిసి భారత్ క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది. గెలుపు ఖాయం అనుకున్న భారత్ కు ఒక్క వికెట్ వల్ల గెలుపు చేజారి డ్రాగా ముగియాల్సి వచ్చింది.
రెండవ ఇన్నింగ్స్ లో చేజింగ్ లో న్యూజిలాండ్ కాస్త బలంగానే కనపడినా మధ్యలో తడబడి భారత్ కు దాదాపుగా మ్యాచ్ అప్పగించేసి చివరి వికెట్ ను కాపాడుకోవడంతొ న్యూజిలాండ్ మ్యాచ్ డ్రాగా ముగించింది.
తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేసిన భారత్, న్యూజిలాండ్ 296 పరుగులకు అవుటవ్వడంతో 49 పరుగుల ఆధిక్యంతో ముందజలో ఉంది. అదే ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి న్యూజిలాండ్ కు 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రెండవ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ చివరకు 165 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను డ్రాగా ముగించి భారత క్రికెట్ క్రీడాభిమానుల ఆశల పై నీళ్ళు చల్లింది.