న్యూయార్క్: ప్రపంచ దిగ్గజ సోషల్ మీడియాల్లో ఒకటైన ట్విట్టర్ కు సీఈవోగా పనిచేస్తున్న జాక్ డొర్సీ తన పదవి నుండి వైదొలిగారు. కాగా ఈ పదవికి భారత సంతతి వ్యక్తి అయిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.
భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ బొంబాయి ఐఐటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈవో అయిన జాక్ డోర్సీ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ కంపెనీ భారతీయ-అమెరికన్ అయిన పరాగ్ అగర్వాల్ ను జాక్ డొర్సీ కి వారసునిగా ట్విట్టర్ కు నూతన సీఈవో గా నియమించింది.