న్యూఢిల్లీ: భారత ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ పెద్ద షాకిచ్చింది. ఒత్తిడితో కూడిన ఆస్తుల విక్రయం, ఫ్రాడ్ కేసులను వర్గీకరించడంలో లోపాలతో పాటుగా మరికొన్ని నిబంధనలను పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై నిన్న కోటి రూపాయల జరిమానాను విధించినట్లు తెలిపింది.
భారత బ్యాంకింగ్ రెగ్యులేటరీ సమ్మతిలో భాగంగా ఏ బ్యాంక్ అయినా తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందాలను బహిర్గత పరచకూడదు. ఈ విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లఘించినట్లు ఆర్బీఐ తెలిపింది. యూబీఐ 2019కు సంబంధించిన స్టాట్యూటరీ ఇన్‌స్పెక్షన్ ఫర్ సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్‌ను ఆర్బీఐ నిర్వహించింది.
2019 ఐఎస్‌ఈ సంబంధిత కరస్పాండెన్స్‌లు మరియు ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ యూనియన్ బ్యాంక్ రెడ్ ఫ్లాగ్ ఖాతాలను వర్గీకరించడంలో మరియు సెక్యూరిటీ రెసిప్ట్ల ప్రొవిజనింగ్‌ను బహిర్గతం చేయడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఫల్యం చెందినట్లు ఆర్బీఐ పేర్కొంది.
దీనికి అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాలను పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫైన్‌ను విధించింది. అంతేకాకుండా బ్యాంకుకు ఎందుకు జరిమానా విధించకూడదో కారణం చూపాలని ఆర్బీఐ నోటీసు జారీ చేసింది.