మూవీడెస్క్: బాలయ్య బాబు మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన తాజా మూవీ “అఖండ్”. ఈ చిత్రం ఇవాళ విడుదల అయ్యింది. కాగా చిత్ర నేపథ్యం ప్రకారం అనంతపురం జిల్లాకు చెందిన మురళీకృష్ణ(బాలకృష్ణ) ఒక రైతు. ఆయన ఊరికి పెద్ద మరియు పేదవారికి అందరికీ అండగా నిలబడుతుంటాడు.
ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం బాటపట్టిన యువతను దారి మళ్ళించి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాడు. పేదవారి కోసం స్కూల్స్, ఆస్పత్రులు కట్టించి సేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య(ప్రగ్యా జైశ్వాల్) మురళీ కృష్ణ మంచితనం చూసి మనసు పడుతుంది. తన ప్రేమ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకుంటుంది.
మారో వైపు వరద రాజులు(శ్రీకాంత్) వరదా మైన్స్ పేరుతో ఆ ప్రాంతంలో పెద్ద మైనింగ్ మాఫియాను నడుపుతుంటాడు. తన అక్రమ వ్యాపారానికి అడ్డొస్తున్నవారిని దారుణంగా హతమారుస్తుంటాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యురేనియం తవ్వకాలను కూడా ప్రారంభిస్తాడు. ఈ తవ్వకాల వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
ఆ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ, యూరేనియం తవ్వకాలను ఆపాలని ప్రయత్నిస్తాడు. అయితే వరదరాజులు తన పలుకుబడితో అతనిపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తాడు. ఈ క్రమంలో అఖండ(బాలకృష్ణ) ఎంట్రీ ఇచ్చి, మురళీకృష్ణ ఫ్యామిలీకి అండగా నిలుస్తాడు.
అసలు అఖండ ఎవరు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటి? మైనింగ్ మాఫియా లీడర్ వరదరాజులు వెనుక ఉన్నదెవరు? మురళీకృష్ణ ఫ్యామిలీని అఖండ ఎలా కాపాడాడు? వరదరాజు ఆగడాలకు అఖండ ఎలా అడ్డుకట్ట వేశాడు?అనేదే మిగతా కథ.
చిత్ర రివ్యూ: 3/5.