హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పని చేసిన శ్రీ కొణిజేటి రోశయ్య (88) ఇవాళ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇవాళ ఉదయం బీపీ సడన్ గా డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
విభజన కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రిగా పని చేసిన రోశయ్య గారు తరువాత తమిళనాడు గవర్నర్‌గా కూడా కొద్ది కాలం పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య గారు జన్మించారు. ఆయన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్రను పోషించారు.