లండన్: ఇప్పటికే కరోనా మరియు ఒమిక్రాన్ తో ప్రపంచంలో మానవాళి బెంబేలెత్తిపోతున్నారు. కాగా ఈ తరుణంలో కోవిషీల్డ్ టీకా రూపకర్త, ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ భవిష్యత్తులో మానవాళికి సోకే వైరస్ లు ఇప్పటి కరోనా కంటే మరింత ప్రమాదకరం మరియు ప్రాణాంతకం అలాగే చాలా తీవ్రంగా వ్యాపించవచ్చని ఆమె ప్రజలను హెచ్చరించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సారా గిల్బర్డ్ మనందరి జీవితాలపై అత్యధిక ప్రభావం చూపిన కరోనా వైరస్ ఇప్పటికి చిట్టచివరిది కాదు, మున్ముందు ప్రపంచంలో ఇంతకంటే ప్రమాదకరమైన్ వైరస్ లు ఎన్నో రావచ్చన్నారు.
కొత్తగా వచ్చే వైరస్ లు మరింత వేగంగా వ్యాప్తి చెందేది, ప్రమాదకరమైంది అయి ఉండొచ్చన్నారు. అయితే, ఇప్పటి మాదిరి పరిస్థితులనే మున్ముందు దాపురించే అవకాశం రానీయవద్దని, ప్రస్తుతం సాధించిన విజయాలను ఆసరాగా చేసుకుని మునుమందు రాబోయే మహమ్మారులను ఎదుర్కొనడానికి మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పూర్తి సమాచారం తెలిసే వరకు కొత్త వేరియంట్ల వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.