కొరియా: శాంసంగ్ కంపెనీ తన కొత్త కెమెరా సెన్సార్‌ను చైనా ఆధారిత కంపెనీ అయిన టెక్నోతో కలిసి రూపొందించింది. శాంసంగ్ కెమెరా సెన్సార్ సహయంతో మెరుగైన రంగు, ప్రకాశంతో కళ్లు చెదిరే ఫోటోలను తీయవచ్చునని శాంసంగ్ కంపెనీ తెలిపింది.
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఈ ఆవిష్కరణను మానవుడి కన్ను (హ్యూమన్ ఐ-లైక్) గా పోల్చింది. తమ ఈ కెమెరా సెన్సార్ ను 2022లో టెక్నో-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకురానున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా అందుబాటులో ఉండనుంది.
కొత్త ఐసోసెల్ జీడబ్ల్యూబీ కెమెరా సెన్సార్ వైట్ పిక్సెల్‌తో కూడిన మెరుగైన కలర్ ఫిల్టర్ నమూనాను ఇందులో ఉపయోగించారని శాంసంగ్ ప్రకటించింది. ఈ సెన్సార్ 64-మెగాపిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. శాంసంగ్ నుంచి రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఈ కొత్త కెమెరా సెన్సార్ రావడం లేదని తెలిపింది.