న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూ ఢిల్లీ సరిహద్దుల్లో గత సంవత్సరం పాటు కొనసాగుతున్న రైతు ఉద్యమం మొత్తానికి విజయవంతంగా ముగిసింది. రైతుల డిమాండ్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పాటు శుక్రవారం బిపిన్‌రావత్ అంత్యక్రియలు ఉండడంతో, 11వ తేదీ ఉదయం 9గంటలలోపు రైతులు సింఘా బార్డర్‌ను ఖాళీ చేయనున్నారు.
ఈ మేరకు తమకు లిఖిత పూర్వక హామీ లభించడంతో రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్ 13వ తేదీన పంజాబ్ రైతులంతా గోల్డెన్ టెంపుల్ సందర్శనకు వెళ్ళనున్నారు. 15వ తేదీన కిసాన్ సంయుక్త మోర్చా మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా, గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన రైతు ఉద్యమం మొదలైంది. రైతు ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలను రద్దు చేసింది. సాగుచట్టాల రద్దు బిల్లుకు నవంబర్ 29న పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.