ట్విట్టర్: భారత దేశం లో దాదాపు ఒక మూడు జెనరేషన్స్ నుండి సినిమా సంగీతం లో టాప్ పోసిషన్ లో ఉన్నాడు ఏ ఆర్ రెహమాన్. ఒక కీ బోర్డు ప్లేయర్ గా కెరీర్ ఆరంభింది ఆస్కార్ రేంజ్ వెళ్లిన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్. తాను తీసిన మొదటి సినిమాకే జాతీయ అవార్డు స్వీకరించిన మ్యూజిషియన్ ఏ ఆర్ రెహమాన్. అతిశయోక్తి కాదు కానీ ఇప్పుడు వచ్చే పాటలు ఒక 5 రోజులు వినగానే బోర్ కొట్టేస్తున్నాయి. అలాంటిది ఏ ఆర్ రెహమాన్ దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం స్వరపరచిన పాటలు ఇప్పటికీ కూడా మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్ లో నడుస్తూ ఉంటాయి, అవి ఎప్పటికీ బోర్ కొట్టవని వాళ్ళు చెప్తూ ఉంటారు.
ఏ ఆర్ రెహమాన్ తన పాత మెమరీ ఒకటి షేర్ చేసుకున్నారు. 1987 లో తాను ఒక సెషన్ మ్యూజిషియన్ గా వర్క్ చేసే రోజుల్లో ఉన్నప్పటి ఒక జ్ఞాపకాన్ని ఫోటో రూపం లో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అప్పట్లో తాను వర్క్ చేసిన మ్యూజిక్ సిస్టం వెర్షన్ కూడా మెన్షన్ చేయడం గొప్ప విషయం. ఫుల్ వర్క్ కానీ ప్లే చేయకుండా ఉండే రోజులు అవి, 9AM నుండి 1PM తర్వాత లంచ్ మళ్ళీ 2PM నుండి 9pm దాదాపు రోజూ ఇదే షెడ్యూల్. సెషన్ మ్యూజిషియన్ గా ఉన్నప్పటి లైఫ్ అని పేమెంట్ ఉండేది అలాగే చాలా నేర్చుకున్నానని , నో కంప్లైంట్స్ అని పోస్ట్ పెట్టారు.