న్యూఢిల్లీ: పేటీఎంకు ఆర్‌బీఐ ఇవాళ శుభవార్తను అందించింది. పేటీఎం 2017లో పేటీఎం పేమెంట్ బ్యాంకును లాంచ్ చేసింది. అయితే తాజాగా ఆర్భీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకుగా స్టేటస్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్‌బీఐ యాక్ట్-1934 కింద రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ కంపెనీ అయిన పేటీయం ఇక పై కొత్త వ్యాపారాలపై ఫోకస్ పెట్టేందుకు ఇప్పుడు మార్గం సుగమం అవుతుంది.
తాజా ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం కంపెనీకు వ్యాపారపరంగా భారీ అవకాశాలను సొంతం చేసుకోనుంది. ప్రభుత్వం, ఇతర పెద్ద పెద్ద కంపెనీలు జారీ చేసే రిక్వెస్ట్ ఆఫ్ ప్రొపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ)లో ఇకపై పేటీఎం కూడా పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. ఇంకా ప్రైమరీ వేలాల్లో కూడా పాల్గొనే అవకాశం పేటీఎంకు వనగూరుతుంది.
ఆర్బీఐ రూపొందించిన నిబంధనలను షెడ్యూల్ బ్యాంకులు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్భీఐ నుంచి రుణాలను కూడా పొందే సౌకర్యం లభిస్తుంది. వీటన్నిటితో పాటుగా రోజువారీ బ్యాంకింగ్ అవసరాల కోసం ఆర్భీఐ నుంచి నగదును అప్పు తీసుకునే సౌకర్యం కూడా షెడ్యూల్ బ్యాంకులకు లభిస్తుంది.